నా రాతలు

ఇవాళ రేపు మన సమాజం లో వేసే రవికెలను చూసి హృదయం ద్రవించిన ఒక సాటి మగవాడు “మౌనమే నీ భాష ఓ మూగ మానస” బాణి లో మీ కోసం…

ఏవిటే నీ ఆశ ఓ మాయ రెవికా
రంగులు ఎన్నెన్నో హంగులు హంగులుగా
గుడ్డలు ఇంతింతే వీపులు అంతంతా
ఏవిటే నీ ఆశ ఓ మాయ రెవికా ఓ మాయ రెవికా

చీకటి గుహ నీవు హుక్కుల వల నీవు
నాటక రంగానివే రెవికా.. తెగిన పతంగానివే
ఎందుకు చూపేవో అర్రులు చాపేవో
ఎందుకు రేపేవో ఏమై మిగిలేవో
ఎందుకు రేపేవో ఏమై మిగిలేవో
ఏవిటే నీ ఆశ ఓ మాయ రెవికా
రంగులు ఎన్నెన్నో హంగులు హంగులుగా
గుడ్డలు ఇంతింతే వీపులు అంతంతా
ఏవిటే నీ ఆశ ఓ మాయ రెవికా ఓ మాయ రెవికా

కోర్కెల సెల నీవు టైలరు కళ నీవు
ఊహల ఉయ్యాలవే రెవికా.. హృదయపు జంపాలవే
లేనిది దాచేవు వీపులు చూపేవు
ఒక పొరపాటుకు నెల తప్పించేవు
ఒక పొరపాటుకు నెల తప్పించేవు
ఏవిటే నీ ఆశ ఓ మాయ రెవికా
రంగులు ఎన్నెన్నో హంగులు హంగులుగా
గుడ్డలు ఇంతింతే వీపులు అంతంతా
ఏవిటే నీ ఆశ ఓ మాయ రెవికా ఓ మాయ రెవికా