నన్ను వదిలి వెళ్లిన నా స్నేహితుడు..😢

ఒరేయ్ వెంకటరామయ్య, ఎందుకు రా, ఇలా ఎవరికీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు? ఎందుకో అందరి లాగానే జీవిత సంఘర్షణ లో పడిపోయి నువ్వు ఎలా ఉన్నావో, ఏమి చేస్తున్నావో, ఏ పరిస్థితి లో ఉన్నావో, ఏమి సమస్యలు ఉన్నాయో అన్న విషయాలు ఏనాడు మాట్లాడుకోలేదు, కలిసినప్పుడల్లా ఏదో సరదాగా మాట్లాడుకోడం తప్ప ఎప్పుడు నిన్ను ఎలా ఉన్నావు అని అడగలేదు, ఆ ధైర్యం కూడా సరిపోలేదు. ఒక్కమాట అడిగి ఉండాల్సింది, అది నువ్వు ఉన్నప్పుడు అనిపించలేదు, ఇప్పుడు అనిపించినా నువ్వు లేవు 😢

ఈ WhatsApp గ్రూప్ ద్వారా లేదా yahoo గ్రూప్స్ ద్వారా చాలా మంది తిరిగి కలుసుకున్న, నీకు ఎందుకో ఎప్పుడు దగ్గర అవలేకపోయాం. అది నువ్వు ఉన్నప్పుడు అనిపించలేదు, ఇప్పుడు అనిపించినా నువ్వు లేవు 😢

నీతో first year roommate గా నాకు, తోట నాగేశ్వర రావు కి ఎన్ని అనుభూతుల్లో, ఎన్ని సరదా సరదా కబుర్లో. నువ్వు అర్దరాత్రి సినిమా చూసి వచ్చి సినిమా లో హీరోయిన్ గురుంచి వర్ణిస్తూ మమ్మల్ని ఊరిస్తూ చేసిన అల్లరి, మబ్బే మసకేసింది లే అని నీ పాట ఇప్పటికి విన్నప్పుడల్లా నువ్వే గుర్తొచ్చేంత impact చేసావు, పప్పు లో ఎండు మిరపకాయ పారెయ్యకుండా తినచ్చు అని నేర్పిచ్చావు, నర్సాపూర్ లో నువ్వు చేసిన హడావుడి, మెహబూబ్ దగ్గర కూడా బీడీలు తీసుకొని కాల్చే నీ విశాల హృదయం (pun intended), Chiranjeevi సినిమాలు, ఇలా ఎన్నో సంగతులు నీతో….

ఎప్పుడు నీ లైఫ్ లో నువ్వు సరదాగా గడిపిందే లేదని నువ్వు చెప్పినప్పుడు చాలా బాధ వేసేది, ఏమో నిన్ను ఎందుకు రా, నేను ఏమైనా చేయగలనా అని అడిగి ఉండాల్సింది. వచ్చే జన్మ లో నైనా నీకు నచ్చిన సంతోషమైన జీవితాన్ని నీకు ప్రసాదించాలని ఆ భగవంతుడిని మనఃస్పూర్తి గా కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పటికి మా మనసులో ఆ కళ్ళజోడు, ఆ చిలిపి నవ్వు తో అలాగే ఉండిపోతావు! 🙏🏽

సదా నీ స్నేహితుడు రామన్!