సెర్రానో పెప్పెర్స్ తో ఊరగాయ

పచ్చడికి కావాల్సినవి:
ఓపిక, ఓర్పు, సహనం, ప్రేమ ~ ఇవి లేక పోతే సంక నాకిపోతుంది, చూసుకోండి ఇంక…
సెర్రానో మిరపకాయలు (10)
నూనె (1/2 కప్)
నిమ్మకాయ రసం (3 తో రసం)
పొడి కోసం: ఆవాలు (3 స్పూన్స్), జీలకర్ర (1 స్పూన్), ఫెన్నెల్ సీడ్స్ (2 స్పూన్స్), మెంతులు (1 స్పూన్), వాము ((1 స్పూన్), ఇంగువ (1/4 స్పూన్), పసుపు, ఉప్పు
మెంతులు (1 స్పూన్ extra)

పచ్చడి లోకి వేసే పొడిని తయారు చేసే విధానం:
చిన్న బాండీ పెట్టుకొని దాంట్లో ఫెన్నెల్ సీడ్స్, జీలకర్ర, వాము, మెంతులు అన్ని కలిపి పొడిగా వేయించుకోవాలి
కొంచెం వేగిన తరువాత ఆవాలు వేసి ఇంకొంచెం సేపు వేయించాలి
వేయించిన వాటిని చల్లార పెట్టి, తరువాత పొడి చేసి పక్కన పెట్టుకోండి

పచ్చడి చేసే విధానం:
సెర్రానో మిరపకాయలు బొమ్మలో చూపినట్టుగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఉంచండి
నూనెని కొంచెం వేడి చేసి దాంట్లో ఇంగువ వేసి చల్లార పెట్టండి
ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ లో మిరపకాయలు వేసి, ఉప్పు, కొంచెం పసుపు, పైన చేసిన పొడిని మరియు పక్కన పెట్టుకొన్న మెంతులు వేసి బాగా కలపండి
దాంట్లో నిమ్మకాయల రసం వేసి బాగా కలపండి
ఇప్పుడు చివరగా కాచి చల్లార్చిన ఇంగువ నూనెని వేసి కలిపేయ్యండి

ఎప్పుడు, ఎలా మింగచ్చు:
ఈ పచ్చడిని ఒక 3 లేదా 4 రోజులు పక్కన ఉంచేసి తరువాత అన్నం లో కలుపుకొని తింటే మీ నోట్లో, బుర్రలో ఉన్న నానా రొచ్చంతా పొయ్యి మనసు ప్రశాంతంగా ఉంటుంది…


1