బెండకాయ పులుసు కూర

కూరకి కావాల్సినవి:
ఓపిక, ఓర్పు, సహనం, ప్రేమ ~ ఇవి లేక పోతే సంక నాకిపోతుంది, చూసుకోండి ఇంక…
బెండకాయలు (10)
పచ్చి మిరపకాయలు (6)
చింతపండు (1/4 లెమన్ సైజు)
నూనె (2 స్పూన్స్ – తిరగమాత కి)
నూనె (2 నుంచి 4 స్పూన్స్ – కూర కి)
ఉప్పు (రుచికి సరిపడా)
పసుపు (1/4 స్పూన్)
తిరగమాతకి: కొంచెం ఆవాలు (1/2 స్పూన్), మెంతులు (1/4 స్పూన్), మినపప్పు (1 స్పూన్), పచ్చిశనగపప్పు (1 స్పూన్), ఎండు మిరపకాయలు (6), ఇంగువ (1/4 స్పూన్))

కూర చేయడానికి కొంచెం ప్రెప్ వర్క్:
బెండకాయలు ఒక ఇంచ్ సైజు లో ముక్కలు చేసుకోండి (జిగురు లేకుండా ఉండాలి అంటే మైక్రోవేవ్ లో ఒక 2 మినిట్స్ పెట్టుకోండి లేదా బాగా ఆరా పెట్టుకోండి)
పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలు చేసుకొని రెడీగా పెట్టుకోండి
తిరగమాత: గిన్నెలో 2 స్పూన్స్ నూనె వేసి ఆవాలు, మెంతులు, మినపప్పు, పచ్చిసెనగపప్పు వేసి వేయించుకొని, దానిలో ఎండు మిరపకాయలు ముక్కలు వేసి, ఇంగువ వేసి దించేసుకొని, చల్లార్చుకోండి
ఇప్పుడు చల్లారిన తిరగమాతని కొంచెం కచ్చాపచ్చాగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి
కొంచెం వేడి నీళ్ళల్లో చింతపండు వేసి నానపెట్టి రసం చేసి ఉంచుకోండి

కూర చేసే విధానం:
గిన్నెలో 2 స్పూన్స్ నూనె వేసి బెండకాయలు వేసి, కొంచెం నీళ్లు పోసి ఉండకపెట్టండి (కూర ఉడకడానికి సరిపడా నీళ్లు మాత్రమే)
కూర బానే ఉడికిన తరువాత, పచ్చిమిరపకాయలు వేసి ఉడికించండి
తరువాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, చింతపండు రసం వేసి ఉడికించండి
దానిలో తిరగమాత కారం వేసి, ఇంకొక 2 స్పూన్స్ నూనె వేసి ఉడికించండి, అయిపాయె…

ఎప్పుడు, ఎలా మింగచ్చు:
నేనైతే నోటితో మింగుతా…
సరేలే కోపం తెచ్చుకోకండి, అన్నం లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కూర తో కుమ్మండి లేదా చపాతీ లో ఐన తినచ్చు…