మా వూరిలో ఆదెమ్మ అని ఒక డాక్టరమ్మ ఉండాది, ఆమెకి ఎవుడన్నాచనిపోయాడంటే వొంటి మీద గుడ్డలుండాయో లేదో కూడా తెలికూండా ఊపుకుంటా వచ్చి విషయం అంత డొక్కొని పోతాది. దీని ఎకసెకలు సూడలేక సావలేం అంటే అతిశయోక్తి లేదుపో!
మొన్న వరసాగ్గా ఫిల్మొల్లు పోయున్డారు కదా, అప్పుడైతే సూడాల ఆదెమ్మని దొడ్డ కాళ్ళతో దొడ్లోంచి లెచొచిన్ధొ ఏమో గాని, నా గుండెల్ని గుమ్మడికాయ వొడియాలు నమిలినట్టు నమిలి సంపింది!!
కుక్కలు సచ్చిన వదలదు. వేరే విషయం గురుంచి ఎమ్మన్నా సెప్తాదేమో అని సూస్తా ఉంటా, నా అత్యాస గాని ఆమె ఎడాగుద్ది. పోని పోయినోళ్ళ గురుంచి మంచిగా ఒక్క ముక్క సెప్తదా? అది లేదు, ఒక ఫైల్మోడికి cancer కాదంట, పొట్ట తగ్గించడానికి ఏదో సేసి నాడంతా అందుకే పోయాడంత, దీని మామ పర్రి!!!